Page Loader
Today Gold Rates: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు

Today Gold Rates: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ముఖ్యంగా భారత్‌లో గోల్డ్‌కు ఉన్న క్రేజ్ మరీ ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక దశలో పసిడి ధరలు ఒక్కసారిగా లక్ష రూపాయల మార్కును దాటి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన తర్వాత, కొంతకాలం తగ్గుముఖం పట్టాయి. కానీ తాజాగా మళ్లీ రేట్లు పెద్ద మొత్తంలో పెరిగి,మరోసారి లక్ష మార్కును అధిగమించాయి. దీని వల్ల సామాన్య ప్రజానికం నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇక నేటి ధరలు కూడా ఈ పెరుగుదల ధోరణిని కొనసాగించాయి.

వివరాలు 

 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర  

ముఖ్య నగరాలైన హైదరాబాద్‌, విజయవాడలలో నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,950గా ఉండగా, నేడు రూ.250 పెరిగి రూ.93,200కు చేరుకుంది. అదే విధంగా, 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.1,01,400గా ఉండగా, నేడు దానిపై రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే, దాని ధర రూ.100 పెరిగి తొలిసారి కిలోకు రూ.1,20,100కు చేరుకుంది. మరోవైపు, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.4,100 పెరగడం విశేషంగా చెప్పుకోవాలి.

వివరాలు 

బంగారు ధరలు 

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,200 24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,680 నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,200 24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,680