LOADING...
Gold: సామాన్యులకు షాక్..పెరుగుతున్న బంగారం ధరలు..తులం ఎంత అంటే?
సామాన్యులకు షాక్..పెరుగుతున్న బంగారం ధరలు..తులం ఎంత అంటే?

Gold: సామాన్యులకు షాక్..పెరుగుతున్న బంగారం ధరలు..తులం ఎంత అంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరి వినియోగదారులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆగస్టు 8, 2025 ఉదయం 6:10 గంటల నాటికి పసిడి రేట్లు మరో కొత్త రికార్డును నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,560కు పెరిగితే, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 94,010కు చేరింది. ఇక ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరుగుదల చూపించాయి.ఆగస్టు 8, 2025న కిలో వెండి ధర రూ. 1,17,100గా ఉంది. ఈ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కొనసాగుతూనే ఉంది.అయితే, స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, అలాగే మార్కెట్‌లోని డిమాండ్‌ ఆధారంగా ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం-వెండి ధరలు 

హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం - రూ. 94,010, వెండి (1 కిలో) - రూ. 1,27,100. ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం- రూ.1,02,710, 22 క్యారెట్ల బంగారం- రూ. 94,160, వెండి - రూ. 1,17,100. చెన్నై: 24 క్యారెట్ల బంగారం- రూ.1,02,560, 22 క్యారెట్ల బంగారం - రూ. 94,010, వెండి - రూ. 1,27,100. ముంబై: 24 క్యారెట్ల బంగారం- రూ.1,02,560, 22 క్యారెట్ల బంగారం - రూ. 94,010, వెండి - రూ. 1,17,100. బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం- రూ.1,02,560, 22 క్యారెట్ల బంగారం - రూ. 94,010, వెండి - రూ. 1,17,100.

వివరాలు 

ధరల పెరుగుదల వెనుక కారణాలు 

బంగారం, వెండి ధరల పెరుగుదలకు దేశీయ, అంతర్జాతీయ కారణాలు రెండూ దోహదపడ్డాయి. ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారడం,అమెరికా డాలర్ విలువ పడిపోవడం కీలక కారణాలుగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ విధానాలు, అలాగే అమెరికా అప్పులు 36 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడం పెట్టుబడిదారులను బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు మళ్లేలా చేసింది. అదనంగా, దేశంలో అమలులో ఉన్న దిగుమతి సుంకాలు, అంతర్గత మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌ కూడా ధరల పెరుగుదలకి తోడ్పడిన అంశాలుగా గుర్తించబడ్డాయి.

వివరాలు 

మార్కెట్‌పై ప్రభావం 

ఈ ధరల పెరుగుదల ఆభరణాల అమ్మకాలపై ప్రభావం చూపింది. చాలామంది కస్టమర్లు 24 లేదా 22 క్యారెట్లకు బదులుగా 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాలను ఎంచుకుంటున్నారు. చిన్న ఆభరణాల షాపుల వ్యాపారం 20% నుండి 25% వరకు తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, బంగారం ఎప్పుడూ సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ పెరుగుదలను సానుకూలంగా స్వీకరిస్తున్నారు. నిపుణుల సూచనలు బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా హాల్‌మార్క్ గుర్తు ఉన్న ఆభరణాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బంగారం,వెండి ధరలు తరచూ మారుతుంటాయి కాబట్టి, కొనుగోలు ముందు మళ్లీ తాజా ధరలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అవసరం.