
Gold Rates: మళ్లీ పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.500 పెరిగిన తులం ధర
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మరోసారి పెరుగుదల నమోదు చేశాయి. నేటి మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.500 పెరిగింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.9,808గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.8,990కు చేరింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలు, డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పులు వంటి అంశాలు పుత్తడి ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.89,900గా ఉండగా, ఇది నిన్నటితో పోల్చితే రూ.500 అధికం.
Details
10 గ్రాముల బంగారం ధర రూ.98,080
అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.98,080కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,050కు చేరగా, 24 క్యారెట్ల ధర రూ.98,230 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు పెరుగుతుండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్‌లో నేడు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,10,900కు చేరింది.
ఢిల్లీలో కిలో వెండి రూ.99,900 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరల పరిణామాలు బంగారంపై పెట్టుబడి చేసే వారికి, ఆభరణాల కొనుగోలుదారులకు ప్రాధాన్యత కలిగినవే.