
Gold Rates: వినియోగదారులకు శుభవార్త.. మరింత పడిపోయిన గోల్డ్ రేట్లు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టి వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నాయి. నేడు తులం బంగారం ధర రూ.110 తగ్గగా, కిలో వెండి ధర మాత్రం రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.10,124, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,280గా ఉంది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.92,800కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,01,240గా ట్రేడ్ అవుతోంది.
Details
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,390గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,26,100గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,16,100 వద్ద ట్రేడ్ అవుతోంది.