Page Loader
5 ఏళ్ల RDపై వడ్డీ పెంచిన కేంద్రం.. కానీ పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు మాత్రం యాథాతథం
ఇతర పొదుపు పCథకాల వడ్డీ రేట్లను

5 ఏళ్ల RDపై వడ్డీ పెంచిన కేంద్రం.. కానీ పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు మాత్రం యాథాతథం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 29, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిటర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వడ్డీ రేటును కేంద్రం పెంచింది. ఈ నేపథ్యంలో మిగిలినవి మాత్రం యథాస్థితిగానే కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల ( Small Saving Schemes Latest Interest Rates ) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై (RECUURING DEPOSITS)పై వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతూ నిర్ణయించింది. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 కాలానికి వడ్డీ రేట్లను వర్తింపజేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

DETAILS

ఇతర పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చకపోవడం పట్ల ఖాతాదారులకు అసంతృప్తి

పీపీఎఫ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి మ పాటు ఇతర పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చకపోవడం ఖాతాదారులను నిరాశకు గురిచేసింది. మరోవైపు సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 7.7%, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై 7.1%, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 8.2%, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.5%, సుకన్య సమృద్ధి యోజన 8% మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది. తాజా వడ్డీ రేట్లలో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ పథకానికి అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ మేరకు సేవింగ్స్‌ డిపాజిట్‌కు కనిష్ఠంగా 4.0 శాతంగా వడ్డీ నిర్ణయించింది.