NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు
    తదుపరి వార్తా కథనం
    Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు
    సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు

    Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 05, 2024
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఉల్లిపాయ ధరలు తగ్గకపోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉల్లి ధరలు కిలోకు రూ.60 వరకు చేరడం వల్ల, కేంద్ర ప్రభుత్వం అక్కడ రాయితీపై ఉల్లిపాయలను విక్రయించాలని నిర్ణయించింది.

    ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరటనిచ్చేలా కిలో ఉల్లి రూ.35కి అందించనుంది. మార్కెట్‌లో ఉల్లి ధరలను తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    కేంద్రం బఫర్‌ స్టాక్‌ను విడుదల చేయడంతో, త్వరలో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉంది.

    వివరాలు 

    సాధారణ ప్రజలకు కిలో ఉల్లి రూ.35కే..

    కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గురువారం నుండి ఉల్లి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

    వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌లకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేసింది.

    ఈ రెండు సంస్థలు సాధారణ ప్రజలకు కిలో ఉల్లి రూ.35కే విక్రయించనున్నారు. ప్రభుత్వ సంస్థలు NAFED , NCCF ప్రభుత్వం తరపున పని చేస్తూ ప్రజలకు చౌక ధరలకు ఆహార పదార్థాలను అందిస్తున్నాయి.

    గత ఏడాది టమోటా, ఉల్లి ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌ల ద్వారా ప్రజలకు తక్కువ ధరల్లో ఆహార పదార్థాలను అందించింది.

    వివరాలు 

    వర్షాల వల్ల మహారాష్ట్రలో ఉల్లిపాయల సరఫరాపై తీవ్ర ప్రభావం

    ప్రభుత్వం ప్రస్తుతం పిండి, పప్పులు, బియ్యాన్ని కూడా తక్కువ ధరలకు విక్రయిస్తూ, ద్రవ్యోల్బణం నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది.

    గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన 'భారత్‌' బ్రాండ్ ఆహార పదార్థాలు త్వరలో సవరించిన ధరలతో మళ్లీ మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి.

    వర్షాల వల్ల మహారాష్ట్రలో ఉల్లిపాయల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల ఉల్లి ధర కిలోకు రూ.10 పెరిగింది.

    ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే,కేంద్ర ప్రభుత్వం త్వరలో బహిరంగ మార్కెట్‌లో బఫర్ స్టాక్ విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరలను నియంత్రించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కేంద్ర ప్రభుత్వం

    ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం  తాజా వార్తలు
    Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు  అమెజాన్‌
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు  పేటియం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025