
UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ నోటీసులు.. బెంగళూరులో QR కోడ్‌లను తొలగిస్తున్న వ్యాపారులు!
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ. 40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటికే 14,000 మందికి పైగా వ్యాపారులకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో బెంగళూరులోని చిన్నచిన్న వ్యాపారులు యూపీఐ పేమెంట్ల విషయంలో జంకుతున్నారు. కొంతమంది తమ దుకాణాల నుంచి యూపీఐ QR కోడ్ స్టికర్లు తీసేయడం ప్రారంభించారు.
Details
నోటీసులపై స్పష్టత ఇచ్చిన కమిషనర్
ప్రస్తుతం నోటీసులు మాత్రమే ఇచ్చాం. ప్రజలు వచ్చి వివరాలు చెబితే.. వారి పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకుంటాం. ఎవరైనా మినహాయింపు పొందిన వస్తువులే విక్రయిస్తే, లేదా కంపోజిషన్ స్కీమ్‌లో ఉంటే, పన్ను భారమే తక్కువ అని కర్ణాటక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ విపుల్ బన్సాల్ 'మనీ కంట్రోల్'కి తెలిపారు. QR కోడ్ తీసేస్తున్న వ్యాపారులు కోవిడ్ తర్వాత కస్టమర్ల ప్రవర్తన మారడంతో పాటు, చిన్న చిన్న లావాదేవీల్లో కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు వ్యాపారులు QR కోడ్ తీసేసి, నగదును డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వినియోగదారులే ATMల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది.
Details
కంపోజిషన్ స్కీమ్‌లో లక్ష మంది వ్యాపారులు ఉన్నా
ప్రస్తుతం కర్ణాటకలో 1% జీఎస్టీ చెల్లించే కంపోజిషన్ స్కీమ్‌లో లక్ష మందికిపైగా వ్యాపారులు ఉన్నారని ఆయన తెలిపారు. "కానీ మిగిలిన వారు కూడా నిబంధనలు పాటించాల్సిందే. చట్టాన్ని సెలక్టివ్‌గా ఫాలో అవడం కుదరదని బన్సాల్ స్పష్టం చేశారు. కొందరు నెటిజన్లు మాత్రం ఈ చర్యను సమర్థిస్తున్నారు. "యూపీఐలోనే 50 లక్షల లావాదేవీలు చేస్తున్న వ్యాపారులు చిన్నవాళ్లా? ఈ చర్య అవసరమే. ఇప్పటికైనా జీఎస్టీ శాఖ కళ్ళు తెరిచిందని ఒకరు వ్యాఖ్యానించారు.
Details
ఇది యూపీఐకి పెద్ద అడ్డంకి కావచ్చు
ఇప్పుడే చిన్న వ్యాపారులు నగదు అడగడం ప్రారంభించారు. ఈ ధోరణి కొనసాగితే, యూపీఐకు ఇది పెద్ద ఇబ్బంది అవుతుందని మరో నెటిజన్ శివరాజ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యూపీఐ వినియోగంలో కర్ణాటక 7.73 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర (13.19%) మొదటి స్థానంలో ఉంది.