
GST: ఫుడ్ డెలివరీపై 18% GSTపెంచిన జొమాటో,స్విగ్గీ
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్ 22 నుండి ఫుడ్ డెలివరీ,క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై వస్తు,సేవల జీఎస్టీ కౌన్సిల్ క్రింద 18 శాతం జీఎస్టీ విధించనుంది. ఈనెల 22నుంచి జీఎస్టీ పెరగనుండడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివారాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు,క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే సర్వీస్ ఛార్జీలపై 18శాతం జీఎస్టీ అమలు చేయబడనుంది. ఈకొత్త పన్నుసెప్టెంబర్ 22నుంచి ప్రారంభం కానుంది.ఫుడ్ డెలివరీ కంపెనీలు, ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫార్మ్‌లపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నాయి. మోర్గాన్ స్టానీ విశ్లేషకుల ప్రకారం,ఈకొత్త పన్ను విధించిన తర్వాత జొమాటో ఆర్డర్‌పై సుమారుగా రూ.2 అదనపు ఖర్చును పెంచవచ్చని..దీనికంటే స్విగ్గీ వినియోగదారుల ఖర్చులు ఎక్కువగా పెరగవచ్చని కూడా సూచన ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫుడ్ డెలివరీపై 18% GSTపెంచిన జొమాటో,స్విగ్గీ
GST council puts 18% tax on food delivery and quick commerce fees.#GSTCouncil pic.twitter.com/kEeTiHMnrX
— The Tatva (@thetatvaindia) September 5, 2025