
GST REFORMS: దీపావళి పండుగ వేళ.. మధ్య తరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ వస్తువులపై ఇక జీరో GST
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ (GST) శ్లాబ్‌లలో పెద్ద మార్పు చేసింది. ఇప్పటి వరకు నాలుగు శ్రేణులుగా ఉండిన జీఎస్టీ శ్లాబ్‌లను ఇప్పుడు రెండు వరకు తగ్గించారు. దీని ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరల్లో గణనీయమైన తగ్గింపు చూడవచ్చని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయం బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకోబడింది. కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.
వివరాలు
ముఖ్యమైన మార్పులు:
5%, 18% జీఎస్టీ శ్లాబ్‌లను రద్దు చేసి, 12% మరియు 28% శ్లాబ్‌లను కొనసాగించారు. ఫలితంగా 5% శ్లాబ్‌లో ఉన్న వస్తువులపై జీరో ట్యాక్స్ విధించనున్నారు. పాలు, పాల ఉత్పత్తులు : పాలు, పాల ఉత్పత్తులు, అల్ట్రా హై టెంపరేచర్ పాలు, శనగలు, పనీర్, పరాఠాలు, పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, రొట్టెలు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపును పొందాయి. తరగతి గది వస్తువులు : విద్యార్థుల కోసం ఉపయోగించే వస్తువులపై పన్ను రద్దు: పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, క్రేయాన్స్, పేస్టల్ రంగులు, మ్యాప్ పటాలు, ఛార్టులు, గ్లోబులు, నోటు బుక్కులు, ఎక్సర్‌సైజ్ బుక్స్, చిన్నారుల ఏరేజర్స్ అన్ని జీరో ట్యాక్స్!
వివరాలు
వైద్య రంగం :
క్యాన్సర్ మందులు, 33 ముఖ్యమైన ప్రాణరక్షక మందులు జీఎస్టీ నుంచి మినహాయింపులో ఉన్నాయి. 12% శ్లాబ్‌లో ఉన్న మందులను జీరో ట్యాక్స్ వద్దకు తీసుకువచ్చారు. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్స్, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్ పై జీఎస్టీ 5% కి తగ్గింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా జీరో ట్యాక్స్‌లోకి తీసుకువచ్చారు.
వివరాలు
వీటిపై కూడా భారీగా జీఎస్టీ తగ్గింపు
వెన్న, నెయ్యి, చీజ్, జామ్, సాస్‌లు, పాస్తా, నమ్కీన్, మిఠాయిలు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సిట్రస్ పండ్లు—18% నుండి 5%కి తగ్గించబడింది. కార్న్ ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులు—5% జీఎస్టీకి తగ్గింపు. కూరగాయ నూనెలు, జంతు కొవ్వులు, మాంసం, చేపలు తక్కువ ధరలో అందుబాటులోకి. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్‌పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, టాల్క్ పౌడర్, టూత్‌బ్రష్‌లు, కొవ్వొత్తులు, సేఫ్టీ మ్యాచ్‌లు, స్టేషనరీ, బొమ్మలు, క్రీడా సామగ్రి, వెదురు ఫర్నిచర్—18% నుండి 5%కి తగ్గింపు. గృహోపకరణాలు, టీవీలు, ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు—28% నుండి 18%కి తగ్గింపు. ఫుట్‌వేర్, టెక్స్టైల్స్—12% నుండి 5%కి తగ్గింపు.
వివరాలు
వీటిపై మాత్రం 28 శాతం నుంచి 40 శాతానికి పెంపు
పొగాకు, విలాసవంతమైన వస్తువులు, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు—28% నుండి 40%కి. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ డ్రింక్స్, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్—40% జీఎస్టీ. SUVలు (1200CC/1500CC), పెద్ద కార్లు, 350CC పైగా మోటార్ సైకిళ్లు, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రివాల్వర్లు, పిస్తోల్‌లు—40% జీఎస్టీ. బొగ్గు, లిగ్నైట్, పీట్—5% నుండి 18%కి పెరుగుదల.
వివరాలు
రూ. 48వేల కోట్ల ఆదాయం లాస్
జీఎస్టీ తగ్గింపు వల్ల సుమారు రూ. 48,000 కోట్లు ఆదాయం తగ్గనున్నా, కానీ వినియోగం పెరుగుదల వల్ల దీని సర్దుబాటు అవుతుంది. వినియోగ వస్తువుల ధరల తగ్గింపు పండుగల సీజన్ ముందు దేశీయ వినియోగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు రైతులకు స్థిరమైన ఆదాయం, పశు సంరక్షణలో పెట్టుబడులు పెరుగుదల కలిగిస్తుంది. వాహనాలపై పన్ను రేట్ల పెరుగుదల, కొంత తగ్గింపులు ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.