
Multibaggar stock : మీరు కొన్నారా..?.. 5ఏళ్లలో 26000శాతం పెరిగిన స్టాక్!
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.
అనేక షేర్లు పతనమవుతున్నా కొన్నింటికి మాత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పతున్నాయి. ఆ మధ్య మెర్క్యూరీ ఎవ్-టెక్ లిమిటెడ్ స్టాక్ ట్రేడింగ్‌లో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఈ కంపెనీ షేర్ల ధర రూ.90.48 వద్ద స్థిరపడింది. 2019లో కేవలం 30 పైసలతో ప్రారంభమైన ఈ షేరు ఇప్పుడు దాదాపు 26,000 శాతం పెరిగింది.
బీఎస్‌ఈలో ఈ షేరు ధర గత 52 వారాల్లో రూ.139.20 వద్ద గరిష్టాన్ని తాకగా, కనిష్టంగా రూ.64.32 నమోదైంది. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1,570 కోట్లు.
Details
కీలక ప్రకటన చేసిన మెర్క్యూరీ ఈవీ
మెర్క్యూరీ ఈవీ టెక్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలక భాగాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న కంపెనీ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
అది గ్లోబల్ కంటైనర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త అనుబంధ సంస్థను స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సంస్థ కంటైనర్ల తయారీపై దృష్టి పెడుతుంది.
ఈ సమయంలో టాటా మోటార్స్ షేరు ధర కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కొన్ని రోజులుగా ఈ షేరు 52 వారాల కనిష్ట స్థాయిలో నిలిచింది.
Details
టాటా మోటార్స్ షేరుకు 'బై' రేటింగ్
అయినా ఎల్‌కేపీ సెక్యూరిటీస్ బ్రోకరేజీ సంస్థ టాటా మోటార్స్ షేరుకు 'బై' రేటింగ్ ఇచ్చింది.
దేశీయ వాణిజ్య వాహనాల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ షేరు ధర టార్గెట్ రూ.970 అని సూచించింది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదల.
ఇప్పుడు మార్కెట్ లో వున్న ఈ రెండు స్టాక్స్ మెర్క్యూరీ ఎవ్-టెక్, టాటా మోటార్స్ షేర్లు పెట్టుబడిదారులకు కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయాన్ని కలిగిస్తాయి.