Page Loader
భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి

భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 21, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఈ దశలో సెన్సెక్స్‌ 888 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్ల మేర నష్టాలను చవిచూశాయి. ప్రధాన కంపెనీలైన ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా గత 6 రోజులు లాభాలు గడించాయి. అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.2 లక్షల కోట్లు మేర ఆవిరైపోయింది. ఉదయం 66,907 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్‌ నష్టాలను మూటగట్టుకుంది. ఒక దశలో 1000 పాయింట్లకుపైగా కోల్పోయి చివరికి 887.64 పాయింట్లతో 66,684.26 వద్ద స్థిరపడింది.

DETAILS

అమెరికా మార్కెట్ సంకేతాలు, ఐటీ స్టాక్స్‌ కారణంగా భారీగా పతనమైన సూచీలు

మరో సూచీ నిఫ్టీ సైతం పతనం దిశగా ట్రేడింగ్ అయ్యింది. ఈ మేరకు 234.20 పాయింట్లతో 19 వేల 745 వద్ద క్షీణించింది.ఈ క్రమంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.81.96గా నమోదైంది. నష్టాల షేర్లు : సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ (8.18 %), హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (3.65%), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ (3.33%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (3.19%), విప్రో (3.07%) షేర్లు నష్టాల బాట పట్టాయి. లాభాల షేర్లు : ఎల్‌అండ్‌టీ (3.88%), ఎన్టీపీసీ (1.09%), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) (0.78%), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (0.70%), టాటా మోటార్స్‌ (0.68%) లాభల్లో పయణించాయి. అమెరికా మార్కెట్ సంకేతాలు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ప్రభావం ఇతర కౌంటర్లపై పడి సూచీలు పతనమయ్యాయి.