Hurun India Rich List 2024: హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
బెంగళూరుకు చెందిన జప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (21) మరోసారి 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024'లో అత్యంత పిన్న వయస్కుడిగా ఎంపికయ్యారు. వోహ్రా తొలిసారిగా 2022లో 19 ఏళ్ల వయసులో ఈ జాబితాలో కనిపించారు. జాబితాలో అతనికి ఇది మూడో సంవత్సరం. 3,600 కోట్ల నికర సంపదతో, భారతదేశంలోని అత్యంత సంపన్నులలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఈ జాబితాలో రెండో స్థానంలో ఆదిత్ పాలిచా
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో రూ. 4,300 కోట్ల నికర విలువతో ఆదిత్ పాలిచా రెండవ అతి పిన్న వయస్కుడు (22)గా నిలిచాడు. వోహ్రా 18 ఏళ్ల వయసులో తన స్నేహితుడు పాలిచాతో కలిసి జప్టోను స్థాపించాడు. ఇది ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్, ఇది 45 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేస్తామని హామీ ఇస్తుంది. జప్టో ఇప్పుడు బెంగళూరు, లక్నో, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో పనిచేస్తుంది.
ఈ జాబితాలో ఇంకా ఎవరు ఉన్నారు?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో, వోహ్రా, పాలిచా తర్వాత, SG ఫిన్‌సర్వ్‌కు చెందిన రోహన్ గుప్తా (25) రూ. 1,300 కోట్ల సంపదతో మూడవ స్థానంలో, BharatPe శాశ్వత్ నక్రానీ (26) నాల్గవ స్థానంలో, ఐదవ స్థానంలో.. PNC ఇన్‌ఫ్రాటెక్ వైభవ్ జైన్ (28) ఉన్నారు. అలాగే ఓయోకు చెందిన రితేష్ అగర్వాల్ (30) ఆరో స్థానంలో, ఫిజిక్స్ వాలాకు చెందిన అలఖ్ పాండే (32) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. వీరిద్దరి ఆస్తులు వరుసగా రూ.1,900 కోట్లు, రూ.4,500 కోట్లు.