Page Loader
పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన  IT శాఖ  
పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన IT శాఖ

పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన  IT శాఖ  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2023
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను శాఖ యూజర్ తమ పోర్టల్ ను పున్నరుద్ధరించింది. ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, వాల్యూ యాడెడ్ ఫంక్షనాలిటీలు, కొత్త మాడ్యూల్‌లను కలిగి ఉన్న ఒక కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సమగ్ర పన్ను సమాచార కేంద్రం ప్రత్యక్ష పన్ను చట్టాలు, ఆదాయపు పన్ను సర్క్యులర్‌లు, నియమాలు, నోటిఫికేషన్‌లకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. వివిధ రకాల సంబంధిత సాధనాలను అందించే 'పన్ను చెల్లింపుదారుల సేవల మాడ్యూల్'ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు.

Details 

అందుబాటులో అనుబంధ పోర్టళ్ల లింక్స్‌ 

పునరుద్ధరించిన ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ మొబైల్‌ రెస్పాన్సివ్‌గా ఉంటుంది. అలాగే కంటెంట్‌ కోసం మెగా మెనూను అందించారు. ఇన్కమ్ టాక్స్ కు సంబంధించి వేర్వేరు చట్టాలు, సెక్షన్లు, నియమాలు, పన్ను ఒప్పందాలు వంటివి సులువైన నావిగేషన్‌ ద్వారా యూజర్లు పొందొచ్చు. రివర్స్‌ కౌంట్‌డౌన్‌తో కూడిన ముఖ్యమైన తేదీల అలర్ట్‌లు, టూల్‌ టిప్స్‌, ఆదాయపు పన్ను శాఖకు చెందిన అనుబంధ పోర్టళ్ల లింక్స్‌ అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఈ లింక్‌కి లాగిన్ చేయడం ద్వారా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చు: https://www.incometax.gov.in/iec/foportal/