NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Paytm:పేటియంకు భారీ షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !
    తదుపరి వార్తా కథనం
    Paytm:పేటియంకు భారీ షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !
    Paytm:పేటియంకు భారీ షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !

    Paytm:పేటియంకు భారీ షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 16, 2024
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL),ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI టోల్ కలెక్టింగ్ విభాగం,ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)ను తొలగించింది.

    ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుండి FASTags కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.

    32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్,ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,యెస్ బ్యాంక్ ఉన్నాయి.

    Details 

    ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి 

    ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించడాన్ని నిలిపివేయాలని జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL)ని ఆదేశించింది.

    అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

    మరోవైపు ఫాస్టాగ్‌ యూజర్లంతా ఆర్‌ బి ఐ మార్గదర్శకాల ప్రకారం.. తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్‌ సూచించింది.

    దాదాపు 98 శాతం, 8 కోట్ల మంది వినియోగదారుల వ్యాప్తి రేటుతో, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికత ఆధారంగా ఫాస్ట్‌ట్యాగ్‌లు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల నుండి నేరుగా హైవే టోల్ ఛార్జీలను చెల్లించడానికి వినియోగదారులను అనుమతిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేటియం

    తాజా

    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్
    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్

    పేటియం

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ భారతదేశం
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం చెల్లింపు
    paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే  తాజా వార్తలు
    Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025