
Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో సుంకాలు లేకుండా ఉత్పత్తులను విక్రయించాలంటే ఆయా ఉత్పత్తులు అక్కడే తయారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఓవల్ కార్యాలయంలో అణుశక్తి విస్తరణకు సంబంధించి అనేక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన కంపెనీ ప్లాంట్ల నిర్మాణం కోసం భారత్‌కు వెళ్లనున్నట్లు నాతో చెప్పారు.
అక్కడికి వెళ్లడం నచ్చదనడం లేదు, కానీ సుంకాలు లేకుండా అమెరికాలో ఆ ఉత్పత్తులను విక్రయించడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పానని ట్రంప్ వెల్లడించారు.
ఐఫోన్లు వంటి ఉత్పత్తులను అమెరికాలో సుంకాలు లేకుండా అమ్మాలంటే, అవి అక్కడే ఉత్పత్తి కావాలని సూచించినట్లు తెలిపారు.
Details
భారత్‌లో తయారీ ఖర్చులు తక్కువే
యాపిల్ ఈ సూచనకు అంగీకరించకపోతే, తమ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు చెల్లించి మాత్రమే విక్రయించవలసి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
అయితే యాపిల్ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం సుంకాలు విధించినా కూడా, భారత్‌లో తయారీ వ్యయాలు తక్కువగా ఉండటంతో ఆర్థికంగా కంపెనీకి లాభంగా ఉంటుందన్నది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తాజా నివేదికలో వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం, భారత్‌లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ చేయడానికి సగటున 30 డాలర్లు ఖర్చవుతుండగా, అదే పనిని అమెరికాలో చేయాలంటే సుమారు 390 డాలర్లు అవసరమవుతాయి.
Details
కార్మికులకు వేతనాలు తక్కువగా ఉండటమే కారణం
ఇది 13 రెట్ల వ్యత్యాసం. ఈ తేడాకు ప్రధాన కారణం భారత్‌లో కార్మిక వేతనాలు తక్కువగా ఉండటమే.
మన దేశంలో సగటు కార్మికునికి నెలవారీ వేతనం 230 డాలర్ల (రూ.19,000) పరిధిలో ఉండగా, అమెరికాలో ఇది కనీసం 2,900 డాలర్ల (రూ.2.4 లక్షలు) వరకు ఉంటుంది.
అలాగే భారత ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక (PLI) పథకం కూడా యాపిల్‌కు అదనంగా లాభాల్ని ఇస్తోందని జీటీఆర్‌ఐ స్పష్టం చేసింది.
పై పరిస్థితుల నేపథ్యంలో, ఐఫోన్లపై అమెరికా 25% సుంకం విధించినా, భారత్‌లో తయారీ యాపిల్‌కు ఖర్చు పరంగా చౌకగానే ఉంటుందని నివేదిక పేర్కొంది.