Page Loader
Henley Passport Index: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 85వ ర్యాంక్ కి పడిపోయిన భారతదేశం.. అగ్రస్థానంలో సింగపూర్ 
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 85వ ర్యాంక్ కి పడిపోయిన భారతదేశం

Henley Passport Index: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 85వ ర్యాంక్ కి పడిపోయిన భారతదేశం.. అగ్రస్థానంలో సింగపూర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ పాస్‌ పోర్ట్‌ సూచీలో భారత స్థానం ఈ ఏడాది ఐదు స్థానాలు తగ్గి 85వ ర్యాంక్‌కు చేరుకుంది. గత ఏడాది ఇది 80వ స్థానంలో ఉండగా, 2006 నుంచి 2025 మధ్య గణాంకాలను పరిశీలిస్తే, 2021లో 91వ స్థానంతో అత్యల్ప స్థాయిని సాధించగా, 2011లో అత్యుత్తమంగా 71వ స్థానంలో నిలిచింది. సింగపూర్ వరుసగా రెండో సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ పాస్‌పోర్ట్‌ సూచీని పౌరసత్వ సేవల సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ విడుదల చేసింది, ఇది ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (IATA) సమాచార ఆధారంగా రూపొందించబడింది. 2025కి సంబంధించి,భారతదేశం 85వ ర్యాంక్‌లో ఉండగా, పాకిస్థాన్ 103వ స్థానంలో, బంగ్లాదేశ్ 100వ స్థానంలో నిలిచాయి.

వివరాలు 

10 ఏళ్లుగా పాస్‌పోర్ట్‌ సూచీలో ర్యాంకింగ్‌ల్లో క్షిణించిన ఈ దేశాలు 

గత సంవత్సరం ఈ దేశాలు వరుసగా 101, 97 స్థానాల్లో నిలిచిన విషయం గమనార్హం.అంతే కాకుండా, జపాన్ 2వ స్థానం, అమెరికా 9వ స్థానం, కెనడా 7వ స్థానం దక్కించుకున్నాయి. ఇదిలా ఉండగా, చైనా అత్యధిక మంది సందర్శించిన దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. 2015లో 94వ స్థానంలో ఉన్న చైనా, 2025 నాటికి 60వ స్థానానికి చేరుకుంది. అలాగే, వీసా రహిత దేశాల సంఖ్యను 40కి పెంచింది. మరోవైపు, పాస్‌పోర్ట్‌ ర్యాంకింగ్‌లో వెనిజులా, అమెరికా, వనౌతు, బ్రిటన్, కెనడాలు గత 10 ఏళ్లలో స్థిరమైన క్షీణతను ఎదుర్కొన్నారు.