Service Sector: సేవా రంగం వృద్ధిలో క్షీణత.. 7 నెలల కనిష్టంలో భారత్
భారతదేశంలో సేవా రంగం (SERVICE SECTOR) అక్టోబర్‌లో ఏడు నెలల కనిష్టానికి దిగిపోయింది. ఈ మేరకు వృద్ధి రేటు మందగించింది. అయినప్పటికీ, ప్రధాన కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఎగుమతులు సైతం స్థిరంగానే పెరిగినట్లు పీఎంఐ ఇండెక్స్ వెల్లడించింది. S అండ్ P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) సెప్టెంబర్‌లో 61.0 నుంచి అక్టోబర్‌లో 58.4కి పడిపోయింది. అయితే సేవా రంగంలో క్షీణత ఉన్నప్పటికీ, 50 పాయింట్ల కంటే ఎక్కువగానే రాణిస్తోంది. సెప్టెంబరులో ఫ్యూచర్ యాక్టివిటీ సబ్-ఇండెక్స్ తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయి నుంచి 63.5కి క్షీణించింది. ఈ సెప్టెంబరు నాటికి 13 ఏళ్ల గరిష్టస్థాయి వ్యాపార కార్యకలాపాల్లో సడలింపు కారణంగా సేవా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొనసాగించింది.
సెప్టెంబరులో ఉద్యోగాల కల్పన మూడు నెలల కనిష్టం
ఈ నేపథ్యంలోనే S అండ్ P గ్లోబల్‌లోని ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా వెల్లడించారు. ఆసియా, యూరప్ అమెరికా నుంచి వచ్చిన కొత్త వ్యాపార లాభాలు తొమ్మిదేళ్ల చరిత్రలో రెండోసారి అత్యధిక వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే ఎగుమతులు, ముఖ్యంగా అక్టోబర్‌లో బలంగా ఉన్నాయి. అయితే, కొత్త వ్యాపార వృద్ధి ఐదు నెలల్లో బలహీనపడటం కొసమెరుపు. ఇదే సమయంలో పలు రకాల సేవలకు తీవ్రమైన పోటీ నెలకొంది. రాబోయే సంవత్సరానికి వ్యాపార దృక్పథంలో తగ్గుదలను సూచిస్తుందని పోలీయానా తెలిపింది. సెప్టెంబరులో ఉద్యోగాల కల్పన మూడు నెలల కనిష్టానికి మందగించిందని వివరించింది. అయినప్పటికీ పెరుగుతున్న ఆహార వినియోగం, ఇంధనం,సిబ్బంది ఖర్చుల కారణంగా కంపెనీలు వినియోగదారులకు పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులను అందించాయన్నారు.