Page Loader
UPI: ప్రపంచంలోనే వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా భారత్‌.. ఐఎంఎఫ్‌ నివేదిక
ప్రపంచంలోనే వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా భారత్‌.. ఐఎంఎఫ్‌ నివేదిక

UPI: ప్రపంచంలోనే వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా భారత్‌.. ఐఎంఎఫ్‌ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థ ప్రపంచంలోని ఇతర అన్ని దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) విధానం,ప్రారంభమైన తర్వాత ఆశ్చర్యకరంగా త్వరితగతిన వినియోగంలోకి వచ్చిందని ఐఎంఎఫ్‌ తన ఫిన్‌టెక్‌ నోట్‌లో వివరించింది. ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ఉండే డెబిట్‌,క్రెడిట్‌ కార్డుల వాడకం గణనీయంగా తగ్గిందని పేర్కొంది. ప్రస్తుతం యూపీఐ ప్రతి నెల సుమారు 1,800 కోట్ల లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోందని వెల్లడించింది.

వివరాలు 

క్లోజ్డ్‌ లూప్‌ సిస్టమ్‌లతో పోలిస్తే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది 

వివిధ పేమెంట్‌ సేవలందించే సంస్థల మధ్య చెల్లింపుల లావాదేవీలు నిరాటంకంగా జరిగేలా చేసే సామర్థ్యం యూపీఐకు ఉందని,ఇది క్లోజ్డ్‌ లూప్‌ సిస్టమ్‌లతో పోలిస్తే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించింది. అంతేకాక, ఈ విధానం మరింత విస్తృతంగా వినియోగంలోకి రావడంతో, కొన్ని ప్రైవేట్‌ రంగ సంస్థలు మార్కెట్‌పై గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రమాదం కూడా ఉన్నందున, అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.