IRCTC Vikalp Scheme: దీపావళికి సొంత ఊర్లకు వెళ్లేవాళ్లకు రైల్వే కొత్త స్కీమ్.. ఈ స్కీమ్‌తో మీ 'సీట్ కన్ఫర్మ్'
ఈ పండుగల సీజన్‌లో,ముఖ్యంగా దీపావళి, ఛత్ పండగల సమయంలో రైలు ప్రయాణం చాలా పెద్ద సవాలుగా మారుతోంది. ఎందుకంటే చాలామంది ముందుగానే తమ రైలు టికెట్లు బుక్ చేసుకుంటారు.రెండు మూడు రోజుల ముందే బుక్ చేసుకోవాలని చూస్తే వెయిటింగ్ లిస్ట్ పెద్దగా ఉంటుంది. మీరు కూడా ఈ దీపావళికి ఊరెళ్లే ప్లాన్ చేస్తూ, మీ టికెట్ కన్ఫామ్ అవుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారా? అయితే, మీకు ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా, మీ రైలు టికెట్ కన్ఫర్మేషన్ అవుతుందనే గ్యారెంటీ ఇవ్వడానికి భారతీయ రైల్వే కొత్త పథకం ప్రవేశపెట్టింది. దీని పేరు ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ (ATAS) లేదా వికల్ప్ యోజన అని అంటారు.
7 రైళ్లలో సీట్లను ఎంచుకునే అవకాశం
వికల్ప్ యోజన రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీ మార్గంలోని మల్టీ ట్రైన్స్ ఆప్షన్ ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. దీనివల్ల మీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా, ఇతర రైళ్లలో సీటు ఖాళీగా ఉంటే టికెట్ కన్ఫర్మేషన్ పొందవచ్చు. దీపావళికి ఊరెళ్లే మీ ప్రణాళికను నిరవధికం చేయాలనుకుంటే, ఈ ఆప్షన్ ద్వారా మీరు సురక్షితంగా మీ రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధానం ప్రయాణికులకు అందుబాటులో ఉన్న గరిష్ఠ 7 రైళ్లలో సీట్లను ఎంచుకునే అవకాశం ఇస్తుంది, అలాగే, మీరు 30 నిమిషాల ముందు నుండి 72 గంటల ముందుగా ఈ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు.
రైల్వే కొత్త పాలసీలు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆప్షన్ తీసుకోవడం ద్వారా సీటు 100 శాతం కన్ఫర్మ్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు, కాని కన్ఫర్మేషన్ అవకాశాలను మాత్రం పెంచుతుంది. ఈజీగా, కన్ఫర్మ్డ్ టికెట్లు పొందడంలో ప్రయాణికులకు కలిగే సౌకర్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే ఎల్లప్పుడూ కొత్త పాలసీలు, సదుపాయాలను ప్రవేశపెడుతూనే ఉంది.