Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,000
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠాల వద్ద మదుపర్ల కొనుగోళ్ల కారణంగా మార్కెట్ లాభాల బాట పట్టింది.
ప్రధాన కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూకుడుగా ఉన్నాయి.
మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల పైగా లాభంతో ప్రారంభమై, నిఫ్టీ 23,100 మార్క్ పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 79.30 డాలర్లు
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 280 పాయింట్లు లాభంతో 77,118 వద్ద ఉండగా, నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 23,085 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్‌టీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇక, జొమాటో, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 79.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,764.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 86.59 వద్ద ఉంది.
వివరాలు
లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
హాంగ్‌సెంగ్, షాంఘై సూచీలు నష్టాల్లో ఉంటే, జపాన్ నిక్కీ, ఏఎస్‌ఎక్స్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ. 5,920 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 3,500 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.