Page Loader
Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు 
ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు

Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మే నెలలో దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల ఉత్సాహం కొంత తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూకు రాకపోయినా, ఎస్‌ఎంఈ విభాగం నుంచే కొన్ని సంస్థలు మాత్రమే మార్కెట్‌ చుట్టూ సందడి చేశాయి. అయితే వచ్చే వారం మాత్రం మెయిన్‌ బోర్డ్‌తో పాటు ఎస్‌ఎంఈ విభాగం నుంచీ పలు కంపెనీలు ఐపీఓలతో బిజీగా మారనున్నాయి.

Details

బోరోనా వీవ్స్‌ ఐపీఓ

గుజరాత్‌ కేంద్రంగా టెక్స్‌టైల్ తయారీ రంగంలో పనిచేస్తున్న బోరానా వీవ్స్‌ మెయిన్‌ బోర్డ్‌ నుంచి పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓకు సబ్‌స్క్రిప్షన్‌ మే 20న ప్రారంభమై మే 22తో ముగియనుంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.144.89 కోట్లు సమీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ధరల శ్రేణి రూ.205 నుండి రూ.216గా నిర్ణయించింది. మే 27న ఈ కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ కానుంది. బీలైన్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.

Details

బెల్రిస్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ

ప్రధాన బోర్డ్‌ నుంచి మరో ఐపీఓగా బెల్రిస్‌ ఇండస్ట్రీస్‌ వస్తోంది. ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు మే 21న తెరతీయనుంది. ఐపీఓ ద్వారా రూ.2,150 కోట్ల నిధులను సమీకరించబోతోంది. ఇందులో భాగంగా 23.89 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ధరల శ్రేణి రూ.85 నుండి రూ.90గా నిర్ణయించారు. మే 28న ఈ షేర్లు మార్కెట్లో లిస్ట్‌ అవుతాయి. యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌, క్యాపిటల్ మార్కెట్స్‌, జెఫ్రీస్ ఇండియా బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.

Details

ఎస్‌ఎంఈ విభాగం నుంచి ఐపీఓలు

విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.40.66 కోట్లు సమీకరించాలనుకుంటోంది. 56.47 లక్షల తాజా షేర్లను విడుదల చేయనుంది. బిడ్డింగ్‌ విండో మే 20 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ ధర రూ.72గా నిర్ణయించారు. డార్‌ క్రెడిట్‌ అండ్‌ క్యాపిటల్‌ రూ.25.66 కోట్ల విలువైన ఈ ఐపీఓ మే 21న ప్రారంభమై 23న ముగుస్తుంది.ఇందులో 42.76 లక్షల తాజా షేర్లు జారీ చేయనున్నారు. మే 28న మార్కెట్లో లిస్ట్‌ అవుతాయి. యూనిఫెడ్‌ డేటా-టెక్‌ రూ.144.47 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో 52.92 లక్షల తాజా షేర్లను మార్కెట్‌లోకి తేనుంది. బిడ్డింగ్‌ మే 22న ప్రారంభమై మే 26న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.260-273గా నిర్ణయించారు.

Details

లిస్టింగ్‌ వివరాలు

వచ్చే వారం పలు కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నాయి. వాటిలో వర్చువల్‌ గెలాక్సీ ఇన్ఫోటెక్‌ మే 19న, ఇంటిగ్రిటీ ఇన్‌ఫ్రాబుల్డ్‌ డెవలపర్స్‌ మే 20న అక్రిషన్‌ ఫార్మాస్యూటికల్స్‌ మే 21న మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి. ఈ ఐపీఓలన్నీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తూ మళ్లీ మార్కెట్లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.