LOADING...
Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌!
వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌!

Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణకు వచ్చే వారం ముగ్గురు ఎస్‌ఎంఈ (SME) సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇవి తమ తమ పబ్లిక్‌ ఇష్యూల ద్వారా పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు, ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ పూర్తిచేసుకున్న ఒక కంపెనీ ఈ వారం లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. గత నెలలో ఏడు మెయిన్‌బోర్డ్‌ కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయినా.. వచ్చే వారం మాత్రం ప్రధాన బోర్డు (Mainboard) నుంచి ఒక్క ఐపీఓ కూడా లేదు.

Details

1. సచీరోమ్ లిమిటెడ్‌ (Sacheerome Limited) 

ఎస్‌ఎంఈ విభాగానికి చెందిన సచీరోమ్‌ లిమిటెడ్‌ ఐపీఓ ద్వారా రూ. 61.62 కోట్లు సమీకరించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఇష్యూ జూన్‌ 9న ప్రారంభమై 11న ముగియనుంది. మొత్తం తాజా షేర్ల జారీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో 60.41 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు. ధర శ్రేణిని రూ. 96 నుండి రూ.102 మధ్యగా నిర్ణయించారు.

Details

 2. జైనిక్ పవర్ అండ్ కేబుల్స్ లిమిటెడ్ (Jainik Power and Cables Limited)

అల్యూమినియం వైర్ రాడ్స్ తయారీ సంస్థ అయిన జైనిక్ పవర్ అండ్ కేబుల్స్, తన ఐపీఓ ద్వారా ₹51.30 కోట్ల నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఇష్యూ జూన్‌ 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఇందులో భాగంగా 46.63 లక్షల తాజా షేర్లు జారీ చేయనున్నారు. ధర శ్రేణి రూ.100-రూ. 110గా నిర్ణయించారు. 3. మోనోలిథిష్ ఇండియా లిమిటెడ్‌ (Monolithisch India Limited) రూ.82.02 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా మోనోలిథిష్ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ జూన్‌ 12న ప్రారంభమై 16న ముగియనుంది. ఇందులో మొత్తం 57.36 లక్షల తాజా షేర్లను రూ.135-రూ. 143 ధర శ్రేణిలో జారీ చేయనున్నారు

Details

4. గంగా బాత్‌ ఫిట్టింగ్స్‌ షేర్ లిస్టింగ్

ఇప్పటికే తన ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి చేసుకున్న గంగా బాత్‌ ఫిట్టింగ్స్‌ కంపెనీ షేర్లు జూన్‌ 11న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశముంది. ఈ ముగ్గురు ఎస్‌ఎంఈ కంపెనీలు ఐపీఓల ద్వారా పెట్టుబడిదారుల నుంచి భారీగా నిధులను సమీకరించేందుకు ప్రణాళికలు రచించగా, గంగా బాత్‌ లిస్టింగ్‌పై కూడా మార్కెట్‌ నెట్రాలు ఉన్నాయి.