
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @23,668.65
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు టారిఫ్‌ల నుంచి రిలీఫ్ ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో, దేశీయ సూచీలు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
అయితే, ఇంట్రాడేలో ఈ ప్రారంభ లాభాలు తగ్గిపోయి,సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
చివరికి, స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. ఇది వరుసగా ఏడో రోజు సూచీలు లాభాలతో ముగియడం గమనార్హం.
ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు బలంగా కొనసాగాయి.మరోవైపు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1%కు పైగా నష్టాలను చవిచూశాయి.
వివరాలు
నిఫ్టీ 10.30 పాయింట్ల లాభం
సెన్సెక్స్ ఈరోజు ఉదయం 78,296.28 పాయింట్ల వద్ద (గత ముగింపు 77,984.38) లాభాలతో ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 78,741.69 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, అమ్మకాల ఒత్తిడితో దాదాపు వెయ్యి పాయింట్ల మేర క్షీణించి, 77,745.63 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
చివరకు 32.81 పాయింట్లు పెరిగి, 78,017.19 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10.30 పాయింట్ల లాభంతో 23,668.65 వద్ద స్థిరపడింది.
విదేశీ మారకంలో, డాలరుతో రూపాయి మారకం విలువ 16 పైసలు పడిపడి, రూ.85.77గా నమోదైంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73.46 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలు సాధించాయి.
జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73.46 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,027 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.