
Market Crash: యుద్ధ ఆందోళనలతో చతికిలపడ్డ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు వెనక్కి!
ఈ వార్తాకథనం ఏంటి
తెల్లవారుజామున 1.44 గంటల సమయంలో భారత త్రివిధ దళాలు సంయుక్తంగా 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా చేపట్టాయి.
ఈ ఆపరేషన్‌లో పాక్ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను బాంబులతో ధ్వంసం చేశారు.
ఈ పరిణామాలు దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ ఉదయం మార్కెట్ ఓపెనింగ్‌కు ముందు జరిగిన ప్రీఓపెనింగ్ సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల దిశగా సంకేతాలిచ్చాయి.
అయితే గిఫ్ట్ నిఫ్టీ మాత్రం సాఫ్ట్ స్టార్ట్‌ను సూచించింది. దేశంలో యుద్ధ భయాలు, భద్రతా ఉద్రిక్తతలు, పాక్ నుండి వచ్చే ప్రతీకార హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్పష్టమైన దిశ లేక అల్లకల్లోలానికి లోనవుతున్నారు.
Details
ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం
పాకిస్థాన్ తాము ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తామో ముందుగానే చెప్పమని వ్యాఖ్యానించడమే ఇందుకు దోహదపడింది.
ఉదయం 9.15 గంటల సమయంలో సెన్సెక్స్ 243 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ 66 పాయింట్ల మైనస్‌లో ఉంది.
అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ సూచీ 33 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ కొనసాగించాయి.
దేశం ఎదుర్కొంటున్న భారత్-పాక్ మధ్య వృద్ధించే భయాలు, బోర్డర్ ప్రాంతాల్లోని ఉద్రిక్తతల కారణంగా ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Details
ప్రపంచ దేశాల నుంచి భారత్ కు మద్దతు
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై త్వరలో కీలక ప్రకటన చేయనుండటంతో, వడ్డీ రేట్ల మార్పుల ప్రభావానికి లోనయ్యే రంగాల షేర్లు దాని ప్రకారమే కదులుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేసిన చర్యలు కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడమే కావడంతో, దీనికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది.
ఈ అంశం కొంతమేరకు ఇన్వెస్టర్లలో భద్రతాభావాన్ని పెంపొందించడంలో సహకరిస్తోంది.