మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం
మెటా గత సంవత్సరం, 11,000 మంది ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మంది ఉద్యోగులను తొలగించింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రస్తుతం మెటా సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మానేజ్మెంట్ లో వివిధ టీంలు ఉండడం. ఖర్చులను తగ్గించే ఆలోచనలో ఉన్న జుకర్‌బర్గ్ మరికొన్ని తొలగింపులను దృష్టిలో ఉంచుకున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. మహమ్మారి తర్వాత టెక్ కంపెనీలు తమ సంస్థలకు కావలసిన సిబ్బందిని మాత్రమే ఉంచుకుంటూ ఖర్చులను తగ్గించే పనిలో పడ్డాయి. కంపెనీలలో ఉన్న మిడిల్ మేనేజ్‌మెంట్ అనవసరమని చాలా సంస్థలు భావిస్తున్నాయి. మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ ఈ నెల ప్రారంభంలో వీటి గురించి తన కార్యాలయ పోస్టులో చర్చను లేవనెత్తారు.
కోడింగ్‌లో సహాయం కోసం AI సాధనాలపై మెటా పని చేస్తోంది
ప్రస్తుతం ఒకే టీమ్‌లో మెటాకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది మేనేజర్లు ఉన్నారని, పని చేస్తున్న వ్యక్తులను పర్యవేక్షించడం వంటి విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా అవసరం లేదని జుకర్‌బర్గ్ తన ఉద్యోగులకు తెలిపారు. కోడింగ్‌లో సహాయం కోసం AI సాధనాలపై మెటా పని చేస్తోంది. ఉద్యోగులతో జుకర్‌బర్గ్ ప్రశ్నోత్తరాలు మిడిల్ మేనేజ్‌మెంట్ అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఉద్యోగుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కంపెనీ ChatGPT-వంటి AI సాధనాలపై పనిచేస్తోందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. యాడ్ రాబడి క్షీణించడం, టిక్‌టాక్ నుండి గట్టి పోటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ స్టాక్‌లను ప్రభావితం చేసిన మాక్రో ఎకనామిక్ హెడ్‌విండ్‌ల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.