Page Loader
Elon Musk: సాఫ్ట్‌వేర్ రంగంలో డిగ్రీ అవసరం లేదన్న మస్క్.. టాలెంట్‌కే పెద్దపీట!
సాఫ్ట్‌వేర్ రంగంలో డిగ్రీ అవసరం లేదన్న మస్క్.. టాలెంట్‌కే పెద్దపీట!

Elon Musk: సాఫ్ట్‌వేర్ రంగంలో డిగ్రీ అవసరం లేదన్న మస్క్.. టాలెంట్‌కే పెద్దపీట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, తన 'ఎవ్రీథింగ్ యాప్' కోసం టాలెంట్ కలిగిన వ్యక్తులను ఆహ్వానించారు. ఈ నియామకాల్లో డిగ్రీల అవసరం లేదా గత అనుభవం అవసరం లేదని మస్క్ స్పష్టం చేశారు. మీరు ఏ స్కూల్‌కి వెళ్లారో చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం మీ కోడ్‌ చూపిస్తే చాలని ఆయన తెలిపారు. మస్క్ ప్రతిభకు పెద్ద పీట వేయడం కొత్త కాదు. 2014లోనే టెస్లాలో ఉద్యోగం పొందేందుకు యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేదని ప్రకటించారు.

Details

మీ కోడ్‌ చూపించండి, ఉద్యోగం పొందండి

ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటే ప్రతిభ, నైపుణ్యాలను ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన నమ్ముతారు. ఇప్పుడు తన కొత్త సంస్థ Xలో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. మస్క్ విద్యా విధానంపై తరచూ విమర్శలు చేశారు. ప్రస్తుత విద్యా విధానం బట్టీ పట్టడంపైనే దృష్టి పెట్టి, నిజ జీవిత సమస్యల పరిష్కారానికి అవసరమైన నైపుణ్యాలను పెంచడంలో విఫలమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్, ఇప్పుడు X కూడా, డిగ్రీల కంటే ప్రతిభను గుర్తించే విధానంలో నియామకాలను చేపడుతున్నాయి. Xను కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా, పేమెంట్స్, మెసేజింగ్, ఈ-కామర్స్, మల్టీమీడియా వంటి అనేక సేవలను ఒకే వేదికగా అందించే గ్లోబల్ హబ్‌గా మార్చడమే మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Details

కోడింగ్ నైపుణ్యంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

2025 నాటికి X మనీ (పేమెంట్ సర్వీస్), X టీవీ (స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్) వంటి ఫీచర్లను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే 2024లో ప్రవేశపెట్టిన AI చాట్‌బాట్ గ్రోక్‌లో కొత్త మార్పులను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నా పరిశ్రమల రూపు మార్చేలా ఆయన వినూత్న ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి.