UIDAI: ఆధార్ 'యూఏడీఏఐ' చైర్మన్‌గా నీల్ కాంత్ మిశ్రా
యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్ కాంత్ మిశ్రాను ఆధార్ కార్డ్ సేవలను అందించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) తాత్కాలిక చైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఐఐటీ దిల్లీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మౌసమ్, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షాలను UIDAIలో తాత్కాలిక సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. చైర్‌పర్సన్, నియమించబడిన సభ్యులు మూడు సంవత్సరాలు లేదా అరవై-ఐదు సంవత్సరాల వయస్సు వరకు పదవిలో ఉంటారని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నీల్ కాంత్ మిశ్రా యాక్సిస్ బ్యాంక్‌లో పని చేయడానికి ముందు జ్యూరిచ్‌లోని క్రెడిట్ సూయిస్‌లో రెండు దశాబ్దాల పాటు సేవలు అందించారు.