Page Loader
Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్
వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్

Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2023
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వినియోగదారులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ప్లిక్స్ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే సేవలు వినియోగించగలరని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. ప్రొఫైల్స్ బదిలీ, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజెస్ వంటి ఫీచర్లతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. కస్టమర్ల అభిరుచి, వారి సంతృప్తి కోసమే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీషోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్ ప్లెక్స్ తెలిపింది. అయితే చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని పేర్కొంది.

Details

60 లక్షల మంది కొత్త చందాదారులు

ముఖ్యంగా పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్ తీసుకురావడంతో దాదాపుగా 60 లక్షలమంది కొత్త చందాదారులు చేరారని నెట్ ఫ్లిక్స్ బుధవారం వెల్లడించింది. మరోవైపు నటీనటుల సమ్మె, యూఎస్ వినోద పరిశ్రమను తాకటంతో సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో 32 కోట్ల 80 లక్షలతో సబ్ స్క్రైబర్లతో 1.5 బిలియన్ల లాభాన్ని ఆర్జించామని కెంపెనీ వివరించింది. నెట్‌ఫ్లిక్స్‌ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్టేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్‌తో పాటు 100కు పైగా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను భవిష్యత్తులో అంగీకరించమని మే నెలలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.