Page Loader
Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000+..
భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000+..

Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000+..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడగా,నిఫ్టీ 24,000మార్కును దాటింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌,ఆటోమొబైల్‌,ఐటీ రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్లు గట్టిపడటంతో మార్కెట్ లాభాలను చవి చూసింది. ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్ మహీంద్రా,బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు సూచీలను ముందుకు నడిపించాయి. మధ్యాహ్నం 12:50 గంటలకు సెన్సెక్స్ 1,013.66పాయింట్ల లాభంతో 79,530వద్ద, నిఫ్టీ 307పాయింట్ల లాభంతో 24,050వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో బజాజ్ ఫిన్‌సర్వ్‌,బజాజ్ ఫైనాన్స్‌,మారుతీ సుజుకీ,మహీంద్రా అండ్ మహీంద్రా,ఇన్ఫోసిస్ షేర్లు మెరుగైన ప్రదర్శన చేయగా,సన్‌ఫార్మా,అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాలను చవి చూశాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ రూ.2లక్షల కోట్ల మేర పెరిగి రూ.446.52లక్షల కోట్లకు చేరింది,ఇది మదుపర్ల సంపద పెరుగుదలకు సూచనగా ఉంది.

వివరాలు 

ఐషర్ మోటార్స్ 25 శాతం వార్షిక వృద్ధి

ఈ వృద్ధి ప్రధాన కారణాలు డిసెంబర్ నెలలో వెలువడిన టోకు వాహన విక్రయ గణాంకాలు. సాధారణంగా డిసెంబర్ విక్రయాలు నెమ్మదిగా సాగుతాయి.కానీ ఈసారి అంచనాలకు మించి విక్రయాలు నమోదుకావడం పాజిటివ్ సెంటిమెంట్‌ను కలిగించింది. ఐషర్ మోటార్స్ 25 శాతం వార్షిక వృద్ధిని,మారుతీ సుజుకీ 30 శాతం వృద్ధిని చూపాయి. దీని ప్రభావంతో ఆయా కంపెనీ స్టాక్స్ రాణించాయి. అదేవిధంగా,డిసెంబర్ త్రైమాసికం నుంచే కాకుండా 2025లోనూ ఐటీ కంపెనీలు మెరుగైన రెవెన్యూ వృద్ధిని సాధించే అవకాశం ఉందని సీఎల్‌ఎస్‌ఏ, సిటీ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశారు. ఈ కారణంగా ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరిగాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, టెక్ మహీంద్రా షేర్లు సూచీల పరుగులకు కారణమయ్యాయి.