
Stock Market Today: లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25000కి చేరువలో నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం రాణించాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 300 పాయింట్లకు మించి లాభపడి, నిఫ్టీ 25,000 మార్క్‌కు మరింత చేరువైంది. ఈ ఉదయం 81,501 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ప్రారంభంలో కొంత ఒడుదొడుకులతో ఎదుర్కొన్నప్పటికీ, పెద్ద సంస్థల షేర్లలో కొనుగోళ్లు బలపడటంతో సూచీ పెరుగుదల కొనసాగించింది. ఒక దశలో 81,799 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. రోజు చివరలో మదుపర్లు లాభాల కొంత భాగాన్ని రియలైజ్ చేసుకోవటంతో సూచీకి కొంత ఒత్తిడి ఏర్పడినప్పటికీ, మొత్తంగా లాభాలను నిలబెట్టుకోగలిగింది.
వివరాలు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసల మేర తగ్గింది
నేటి సెషన్‌లో సెన్సెక్స్ 329.05 పాయింట్ల లాభంతో 81,635.91 వద్ద ముగిసింది. ఇంతలో నిఫ్టీ 24,894 నుండి 25,021 పాయింట్ల మధ్య కదిలింది. చివరికి 97.65 పాయింట్ల పెరుగుదలతో 24,967.75 వద్ద స్థిరపడింది. మార్కెట్‌కు సంబంధించి,డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసల మేర తగ్గి 87.58 వద్ద స్థిరపడింది. సెప్టెంబర్‌లో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత జరగవచ్చన్న అంచనాలతో ఐటీ రంగ సూచీ 2.3 శాతం పెరుగుదల సాధించింది. రియాల్టీ రంగం 0.7 శాతం,లోహ రంగ సూచీ 0.6 శాతం పెరిగాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్,టీసీఎస్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,విప్రో,హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. ఇక అపోలో హాస్పిటల్స్, నెస్లే ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు నష్టపోయాయి.