LOADING...
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,730
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,730

Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,730

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఉదయం 9:33 గంటల సమయంలో, బీఎస్ఈ సెన్సెక్స్‌ 188 పాయింట్లు పడిపోయి 81,003 స్థాయిలో కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ ఇండెక్స్‌ 36 పాయింట్లు నష్టపోయి 24,730 వద్ద ట్రేడవుతోంది. విదేశీ మారక ద్రవ్యాలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.58గా నమోదైంది.

వివరాలు 

లాభాలు,నష్టాల్లో ఉన్న షేర్లు ఇవే 

నిఫ్టీ సూచీలో కొన్ని షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా, మరికొన్ని స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్‌యూఎల్‌, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌, హీరో మోటోకార్ప్‌, ఆసియన్ పెయింట్స్‌, ట్రెంట్ వంటి కంపెనీల షేర్లు లాభాల నమోదు చేస్తుండగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

వివరాలు 

ట్రంప్ నిర్ణయాలతో సూచీలపై ప్రభావం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విధంగా, ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇరాన్ నుండి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారతీయ సంస్థలపై ఆంక్షలు విధించారు. ఈ రెండు పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. తద్వారా సూచీల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.