Page Loader
Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. సెన్సెక్స్ 182 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు చొప్పున నష్టం
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. సెన్సెక్స్ 182 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు చొప్పున నష్టం

Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. సెన్సెక్స్ 182 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు చొప్పున నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు కనిపించడంతో ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే,కొన్ని ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో కొద్దిసేపు మార్కెట్లు లాభాల్లోకి వెళ్లినప్పటికీ, ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాలు పెరగడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 81,465.69 పాయింట్ల వద్ద ప్రారంభమైంది ఇది క్రితం ముగింపు అయిన 81,633.02 కంటే తక్కువ. ట్రేడింగ్ స‌మ‌యంలో ఈ సూచీ ఓ మోస్తరు స్థాయిలో కదలాడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో కనిష్టంగా 81,286.45 పాయింట్లకు చేరింది. చివరికి, సెన్సెక్స్‌ 182 పాయింట్ల నష్టంతో 81,451.01 వద్ద రోజును ముగించింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.41 డాలర్లు 

అదే విధంగా, నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 24,750.70 వద్ద ముగిసింది. రూపాయి మారకపు విలువ కూడా డాలర్‌తో పోల్చితే 85.57 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఏషియన్ పెయింట్స్‌, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ముగిసాయి. కానీ ఎటర్నల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రం లాభాలను నమోదు చేశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది.