Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
గత మూడు రోజుల నుండి లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, అంతర్జాతీయంగా వచ్చిన బలహీన సంకేతాలతో నష్టాలు ఎదుర్కొన్నాయి.
ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి షేర్లలో మదుపర్లు కొనుగోలు చేయడంతో సూచీలు కుంగాయి.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 367 పాయింట్ల నష్టంతో 76,706 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 23,220 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎమ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.57 డాలర్లు
ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, జొమాటో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.57 డాలర్ల వద్ద ఉంది, బంగారం ఔన్సు ధర 2,746.80 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.56 వద్ద కొనసాగుతోంది.
అమెరికా మార్కెట్లు, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.4,342 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,929 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.