LOADING...
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాలు భారీగా జరగడం సూచీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అంతేకాక, భారత్‌, అమెరికా మధ్య ట్రేడ్‌ ఒప్పందం(ట్రేడ్ డీల్)పై ఇంకా స్పష్టత రాకపోవడం, విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడటం, తక్కువగానే ఉన్న తొలి త్రైమాసిక (Q1)ఫలితాలు పెట్టుబడిదారుల మనోభావాన్ని దెబ్బతీశాయి. ఈ ప్రభావంతో ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్‌ 650పాయింట్లకు పైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 25,100 పాయింట్లకు దిగువకు చేరుకుంది. సెన్సెక్స్‌ ఉదయం 82,779.95 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇది గత ముగింపు స్థాయి అయిన 82,726పాయింట్ల కంటే కొద్దిగా పైగానే ఉంది.అయితే ఇది కొన్ని క్షణాల్లోనే నష్టాల్లోకి జారుకుంది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 69 డాలర్లు 

ట్రేడింగ్ సమయంలో 82,047.22 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌, చివరికి 542.47 పాయింట్ల నష్టంతో 82,184.17పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 157.80పాయింట్ల నష్టంతో 25,062 వద్ద ముగిసింది. అంతేగాక,రూపాయి-డాలర్ మారకం విలువ 86.41గా నమోదైంది. సెన్సెక్స్‌కు చెందిన 30షేర్లలో ఎటెర్నల్‌, టాటా మోటార్స్‌, సన్ ఫార్మా, టాటా స్టీల్‌, టైటాన్‌ వంటి కొద్ది కంపెనీల షేర్లే లాభాల్లో నిలిచాయి. మిగిలిన అన్ని షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ట్రెంట్‌, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ షేర్లు ముఖ్యంగా భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 69 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,367 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.