Page Loader
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550 
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం స్థిరంగా (ఫ్లాట్‌గా) ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ (Sensex) 5 పాయింట్లు పెరిగి 74,607 వద్ద, నిఫ్టీ (Nifty) 8 పాయింట్లు పెరిగి 22,555 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌,పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌,ఎన్టీపీసీ,టాటా మోటార్స్‌,టెక్‌ మహీంద్రా,కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,టీసీఎస్‌,మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

వివరాలు 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 72.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2,920.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు మునుపటి ట్రేడింగ్ సెషన్‌ను స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగించాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.22 శాతం, జపాన్‌ నిక్కీ 0.15 శాతం లాభాల్లో కొనసాగుతుండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.66 శాతం, షాంఘై 0.42 శాతం నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.3,529 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,031 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.