Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయ సూచీలకు మద్దతుగా నిలిచాయి.
ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్ల కొనుగోళ్ల వల్ల మార్కెట్ సూచీలు పాజిటివ్‌గా రాణిస్తున్నాయి.
మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో ప్రారంభమై, నిఫ్టీ 23,400 మార్క్ పైగా ఉంది.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 103 పాయింట్లు లాభంతో 77,177 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 23,412 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
నేడు లాభాల్లో కొనసాగుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
కానీ జొమాటో, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.22 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 2,743.90 వద్ద ట్రేడవుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.28 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.4,337 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,322 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.