NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700
    లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700

    Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత వారం పెద్ద నష్టాలను ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం పుంజుకున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు అందుతున్నప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్ల కొనుగోలు సూచీల వలన మార్కెట్లు పాజిటివ్‌గా మారాయి.

    ఈ కారణంగా నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

    బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 23,700 మార్క్ పై కదలాడుతోంది.

    ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 643 పాయింట్లు పెరిగి 78,685 వద్ద ట్రేడ్ అవుతోంది, అలాగే నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 23,786 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

     జొమాటో షేర్లపై మదుపర్లు ఆసక్తి 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.03 వద్ద స్థిరంగా ఉంది.

    నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, ఎల్ అండ్ టీ షేర్లు వృద్ధిని చూపిస్తున్నాయి.

    అయితే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి.

    సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో చేరింది. ఈ మార్పుతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్థానాన్ని జొమాటో భర్తీ చేసింది.

    ఈ మార్పు నేటి నుండి అమల్లోకి వచ్చింది. దీంతో జొమాటో షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 2.52 శాతం నష్టంతో రూ.275.20 వద్ద ట్రేడ్ అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ! పాకిస్థాన్
    Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు ఆంధ్రప్రదేశ్
    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం టెక్నాలజీ
    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ వ్యాపారం
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎంత పెరిగిందంటే.. బిజినెస్
    Stock Market: రెండోరోజు ఫ్లాట్‌గానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025