
Fact check: యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ.. పుకార్లపై కేంద్ర ప్రభుత్వం వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
రూ.2000కిపైగా విలువగల లావాదేవీలపై జీఎస్టీ అమలు చేయనున్నట్టు కొన్ని మీడియాల్లో ప్రచారమవుతున్న నేపథ్యంలో, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధింపు గురించి ఈ ఉదయం నుండి కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికలపై చురుగ్గా ప్రచారం జరగడంతో, దీనిపై ప్రభుత్వం స్పందించింది.
వివరాలు
డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడమే లక్ష్యం
''రూ.2,000 కంటే ఎక్కువ విలువ గల లావాదేవీలపై జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం పరిగణిస్తోంది'' అనే వార్తలు కొన్ని మీడియా వర్గాల్లో వెలువడ్డాయి.
అవన్నీ పూర్తి అవాస్తవం. తప్పుదోవ పట్టించే వార్తలని కేంద్రం ఖండించింది.
అలాంటి వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని స్పష్టం చేసింది.
యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.