Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిరాశే.. కొత్త రైళ్లు లేవు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు సంబంధించి ఊరట కలిగించే అంశాలేమీ లేకపోవడం గమనార్హం. నిత్యం రైలు ప్రమాదాలు, ప్రయాణికుల సమస్యల మధ్య ఈసారి సార్వత్రిక బడ్జెట్‌లో రైల్వేశాఖకు పెద్దపీట వేస్తారని ప్రజలు ఆశించగా, ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే రైల్వే అనే పదాన్ని ఉపయోగించారు,
కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు
ఇక నూతన రైళ్లు, రైల్వే లైన్లు, వంటి ప్రాజెకట్టులేవీ మంజూరు కాలేదు. రైల్వేశాఖకు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు
రైల్వే షేర్లు పతనం
బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటన లేకపోవడంతో, రైల్ వికాస్ నిగమ్ (RVNL), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), IRCON ఇంటర్నేషనల్, రైల్‌టెల్ కార్పొరేషన్, టెక్స్‌మో రైల్ & ఇంజనీరింగ్ వంటి రైల్వే స్టాక్‌లు 1-5 శాతం క్షీణించాయి. అదే విధంగా మధ్యంతర బడ్జెట్‌లో ఇవి 11-112 శాతం పెరిగాయి. ఇక మధ్యంతర బడ్జెట్‌లో రైల్వే భద్రత, కొత్త కోచ్‌లు, కారిడార్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.