LOADING...
NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం
ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం

NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) యాజమాన్యంలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ, ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 19న ప్రారంభమై, నవంబర్ 22న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం నవంబర్ 18న బిడ్డింగ్‌ విండో ప్రారంభమవుతుంది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, స్విగ్గీ తర్వాత, ఈ ఏడాదిలో రానున్న మూడో అతిపెద్ద ఐపీఓ ఇదే కావడం విశేషం. ధరల శ్రేణి : రూ.102-రూఁ 108 లాట్‌ సైజ్ : 138 షేర్లు రిటైల్‌ మదుపరులకు : ఒక లాట్‌ కొనుగోలుకు రూ.14,904 రిటైల్‌ ఇన్వెస్టర్లకు : గరిష్ఠంగా 13 లాట్లను కొనుగోలు చేసే అవకాశం

Details

ఉద్యోగుల కోసం రూ.200 కోట్ల షేర్లు రిజర్వ్

ఇప్పటికే, క్యూఐబీలకు 75%, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 15%, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10% షేర్లు రిజర్వ్‌ చేశామని కంపెనీ పేర్కొంది. రూ.200 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగుల కోసం రిజర్వ్‌ చేసింది. అర్హులైన ఉద్యోగులకు రూ.5 డిస్కౌంట్‌తో షేర్లు అందించనున్నాయి. ఇక షేర్ హోల్డర్లకు రూ.1,000 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. 2022 ఏప్రిల్‌లో స్థాపించిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ, అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది.