NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ .. రూ.10వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) తన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం మార్కెట్ నుంచి నిధులను సమీకరించేందుకు ఐపీఓ (Initial Public Offering) ఆమోదం పొందింది. సెబీ (SEBI) ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నవంబర్ మొదటి వారంలో సుమారు రూ.10,000 కోట్ల నిధులను సమీకరించే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించనుంది.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ వివరాలు
ఈ ఐపీఓ ద్వారా రూ.10 ముఖ విలువ కలిగిన కొత్త ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. ఉద్యోగులకు ప్రత్యేక రిజర్వేషన్, డిస్కౌంట్ అందజేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే, ఎన్టీపీసీ షేర్ హోల్డర్లకు ప్రత్యేక కోటా కూడా ఉంటుందని, వారందరూ ఈ ఐపీఓలో భాగస్వాములు కావచ్చని తెలిపింది. ఫండ్స్ వినియోగం ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మొత్తం రూ.10,000 కోట్లలో రూ.7,500 కోట్లు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు, అలాగే రుణాలు చెల్లించేందుకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనుంది.
NTPC గ్రీన్ ఎనర్జీ,రికార్డు ఆదాయం
ప్రస్తుతం NTPC గ్రీన్ ఎనర్జీ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.578.44 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకి ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు బుక్ రన్నింగ్ మేనేజర్లుగా ఉన్నారు.