Loading...
Nvidia: మెగాస్పీడ్‌పై ఎన్విడియా చర్యలు.. 2025లోనే బ్లాక్‌లిస్ట్‌లోకి!
మెగాస్పీడ్‌పై ఎన్విడియా చర్యలు.. 2025లోనే బ్లాక్‌లిస్ట్‌లోకి!

Nvidia: మెగాస్పీడ్‌పై ఎన్విడియా చర్యలు.. 2025లోనే బ్లాక్‌లిస్ట్‌లోకి!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 17, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాధునిక ఎన్విడియా ఏఐ చిప్స్‌ చైనాకు అక్రమంగా చేరాయనే అనుమానాలు సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్‌ కంపెనీని చిక్కుల్లోకి నెట్టాయి. ఈ వ్యవహారంపై అమెరికా వాణిజ్య శాఖ, న్యాయ శాఖ తాజాగా కీలక వివరాలను వెల్లడించాయి. సున్నితమైన సెమీకండక్టర్‌ టెక్నాలజీ ఇతర దేశాలకు మళ్లుతున్నట్లు ముందస్తు నిఘాలో గుర్తించడంతో 2024లోనే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపాయి. ఎగుమతి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Details

ఎన్విడియా నుంచి కీలక చర్య

2025 మేలో మెగాస్పీడ్‌కు నేరుగా లేదా ఇతర మార్గాల ద్వారా చిప్స్‌ విక్రయించారా అనే వివరాలను అమెరికా అధికారులు ఎన్విడియాను కోరారు.

ఆ తర్వాత జూన్‌లో మెగాస్పీడ్‌ను తమ 'నో సెల్‌' జాబితాలో చేర్చినట్లు అమెరికా ప్రకటన వెల్లడించింది. అంటే ఆ సంస్థకు చిప్స్‌ విక్రయించకూడదని ఎన్విడియా నిర్ణయించింది.

అదే నెలలో అమెరికా అధికారులు, సింగపూర్‌ పోలీసులతో కలిసి మెగాస్పీడ్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, అప్పటి సీఈఓ ఆలిస్‌ హువాంగ్‌ను ప్రశ్నించారు.

అనంతరం క్రిమినల్‌ దర్యాప్తు బాధ్యతను అమెరికా న్యాయ శాఖ చేపట్టింది.

Details

చిప్స్‌ అక్రమ రవాణాపై అమెరికా హెచ్చరిక

సెమీకండక్టర్ల అక్రమ రవాణాకు సంబంధించి గతంలో ఆరు వేర్వేరు దర్యాప్తుల్లో 17 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

మెగాస్పీడ్‌ విషయంలోనూ నేరం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు కంపెనీపై ఆరోపణలు నిర్ధారణ కాలేదు.

తాము చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహించామని, విచారణకు సహకరిస్తున్నామని మెగాస్పీడ్‌ చెబుతోంది. ఆలిస్‌ హువాంగ్‌ 2025 ఆగస్టు 30న సంస్థను వీడినట్లు కూడా ప్రకటించింది.

ADVERTISEMENT

Details

జెన్సెన్‌ హువాంగ్‌ వ్యవహారంతో మరింత చర్చ

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌తో ఆలిస్‌ హువాంగ్‌కు ఉన్న వ్యక్తిగత సంబంధాలపై వచ్చిన వార్తలతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

జెన్సెన్‌ తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు ఉద్యోగులకు పంపిన సందేశంలో అంగీకరించి క్షమాపణ చెప్పారు. ఆలిస్‌కు చైనా నిఘా సంస్థలతో సంబంధాలున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే ఆమె చైనా గూఢచారి అన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

ఈ వివాదాల నేపథ్యంలో జెన్సన్‌ నవంబర్‌ 12న సీఈఓ పదవికి రాజీనామా చేయగా, ఎన్విడియా నాయకత్వ మార్పు కూడా ప్రపంచ టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT