Petrol Price: లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటనతో.. కుప్పకూలుతున్న చమురు ధరలు.. 5 శాతం డౌన్..
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుంది. పరస్పర దాడులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో, మిడిల్ ఈస్ట్‌లోని ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలగవచ్చని ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం ఈ యుద్ధ పరిణామాల కారణంగా చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇటీవల బ్రెంట్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్న ఆశలు పెరిగాయి. ఇదే సమయంలో, దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే క్రూడాయిల్ ఉత్పత్తులపై విండ్‌ఫాల్ టాక్స్‌ను సున్నా చేసారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై ఈ విండ్‌ఫాల్ టాక్స్ జీరోగానే ఉంది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం
ఇక పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లపైకి చేరుకుంది. దీంతో,దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళన మొదలైంది.అయితే, ఇక్కడ మళ్లీ అంచనాలు మారాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు మంగళవారం భారీగా పతనమయ్యాయి.సోమవారం ఉన్న లాభాలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అక్టోబర్ 8న ముడి చమురు ధరలు 5శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. ముందుగా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో, ఇప్పుడు ఊరట కలిగించే ప్రకటన వచ్చింది. లెబనాన్, ఇరాన్ మద్దతు చే ఉన్న హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినప్పుడు, సానుకూల సంకేతాలు కనపడుతున్నాయి.
ఆగస్ట్ తర్వాత తొలిసారి బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు
దీంతో హెజ్‌బొల్లా,ఇరాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారణంతో క్రూడాయిల్ ధరలు పడిపోయాయి.బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5శాతం పతనమైంది. బ్యారెల్‌కు 3.70డాలర్లు తగ్గి 77.23డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 4.63శాతం పతనంతో బ్యారెల్‌కు ప్రస్తుతం 73.57 డాలర్లకు దిగొచ్చింది. సెషన్ కనిష్టాల నుండి ఇవి ఒకరోజులో 4 డాలర్ల కంటే ఎక్కువగా పడిపోయాయి. సోమవారం రోజు ఆగస్ట్ తర్వాత తొలిసారి బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లపైకి చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే,చమురు రేట్లు ఇంకా పడిపోతాయి.అప్పుడు,దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 కాగా,డీజిల్ ధర లీటర్‌కు రూ.95.65గా ఉంది.