
Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం పసిడి ప్రియులను కలవరపెడుతోంది. గత నెలరోజులుగా ప్రతి రోజు స్వల్పంగా అయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే నెల ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,000ల సమీపంలో ట్రేడ్ కాగా, ప్రస్తుతం అది రూ.99,000లకు చేరుకుంది. ఇదే వేగం కొనసాగితే త్వరలోనే బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ను తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెరుగుదలతో పేద,మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే పది మార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా శుభకార్యాల కోసం బంగారం కొనాలని యోచించే వారు ధరలు తక్కువయ్యే వరకు వేచి ఉండడం మంచిదని, మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
హైదరాబాద్‌లో బంగారం ధరలు:
తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో నిన్నటితో పోల్చితే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ.91,300 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ.99,600 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ.74,700గా ట్రేడ్ అయింది. నిన్నతో పోలిస్తే గ్రాముకు ఒక్క రూపాయి చొప్పున, మొత్తం 10 రూపాయల పెరుగుదల నమోదైంది. తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,610 22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,310 18 క్యారెట్ల బంగారం ధర - రూ.74,710 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది.
వివరాలు
హైదరాబాద్‌లో వెండి ధరలు:
గత కొన్ని వారాలుగా వెండి ధరలు తగ్గుతుండగా, తాజాగా అవి మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. నిన్న హైదరాబాదులో: 100 గ్రాముల వెండి ధర - రూ.10,400, 1 కిలో వెండి ధర - రూ.1,04,000 వద్ద ట్రేడ్ అయింది. ఇక ఈరోజు వెండిపై కూడా లాభం నమోదైంది. 100 గ్రాముల వెండి ధరలో రూ.10 పెరగగా.. కేజీ వెండి ధరలో రూ.100 పెరిగింది. తాజాగా, 100 గ్రాముల వెండి ధర - రూ.10,410 కేజీ వెండి ధర - రూ.1,04,100 వద్ద ట్రేడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రీతిలో పసిడి,వెండి ధరలు పైపైకి పయనిస్తుండటంతో వినియోగదారులు కొనుగోళ్లపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.