OTT Push: వీడియో మార్కెట్ రంగంలో భారతదేశం సంచలన రికార్డు
భారత్‌లో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ మార్కెట్ 2028 నాటికి $13B చేరుకొనుంది. దీంతో రూ.1.08 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని 'మీడియా పార్టనర్స్ ఏషియా' నివేదిక స్పష్టం చేసింది. ఇక రానున్న నాలుగేళ్లలో ఈ పరిశ్రమ ద్వారా 2.8 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. టీవీ నెట్‌వర్క్‌లు, ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్‌ల నుండి వచ్చే ఆదాయాలను కలిగి ఉన్న వీడియో మార్కెట్‌లోని కొత్త ఆదాయంలో సగభాగాన్ని స్ట్రీమింగ్ VoD కలిగి ఉండనుంది.
ఏటా 4వేల కోట్లు ఖర్చు పెడుతున్న నెట్ ప్లిక్స్, అమెజాన్
గతేడాది ప్రీమియం ఆన్‌లైన్ వీడియో రంగం సుమారు $1.7 బిలియన్లను సంపాదించింది. ఈ సంఖ్య 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా $3.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుత నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో వీడియో మార్కెట్ వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఇక వీడియో ఎంటర్ టైన్ మెంట్ ఎకానమీ 2028 నాటికి 8శాతం వార్షిక వృద్ధిని సాధించనుందని అంచనా వేశారు. అదే విధంగా 2018లో ఈ ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ.27 వేలకోట్లుగా ఉంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ కంపెనీలు ఇండియాలో స్థానిక కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ప్రతేడాది సూమారు రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.