
Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో పామాయిల్ దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2022-23 ఏడాదికి సంబంధించి తొలి 11 నెలల్లోనే దేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం ఎగబాకింది. ఈ మేరకు 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.
మరోవైపు ఆయా దిగుమతులు పెరగడం దేశీయ రిఫైనర్లకు ఆందోళన కలిగిస్తోందని ఎస్ఈఏ వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల నూనెను కొనుగోలు చేసే దేశంగా భారత్ కు గుర్తింపు ఉంది. గత సీజన్‌లో దాదాపు 70.28 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంది.
దేశవ్యాప్తంగా కూరగాయల నూనె దిగుమతి 2022-23 నవంబర్-సెప్టెంబర్ మధ్య 20 శాతం పెరిగింది. దీంతో 156.73 లక్షల టన్నులకు చేరుకున్నాయి. గత సీజన్‌లో ఇదే సమయంలో 130.13 లక్షల టన్నులుగా ఉంది.
DETAILS
గతేడాది ఇదే కాలంలో 16.32 లక్షల టన్నులుగా నమోదుేే
దేశ కూరగాయల నూనె దిగుమతులు సెప్టెంబర్‌లో 5 శాతం క్షీణించి 15.52 లక్షల టన్నులకు పతనమయ్యాయి.
గతేడాది ఇదే కాలంలో 16.32 లక్షల టన్నులుగా నమోదైనట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ప్రకటించింది.
ఉత్పత్తుల దిగుమతి వేగంగా పెరగడంతో పామాయిల్ వాటా 59 శాతానికి దూసుకెళ్లింది.కానీ సోయాబీన్, ఇతర నూనెలతో పోలిస్తే ముడి పామాయిల్ ఇంపోర్ట్స్ కొద్దిగా క్షీణించాయి.
సరిపడ దేశీయ లభ్యత ఉన్నా దేశంలో ఆహార చమురు ధరలు భారీగా తగ్గడంతో డిమాండ్‌ను పెంచేసింది.
ఇటీవలే కాలంలో తలసరి వినియోగం పెరిగిందని SEA పేర్కొంది. 2022-23 చమురు సంవత్సరం నవంబర్-సెప్టెంబర్ కాలంలో శుద్ధి చేసిన చమురు దిగుమతులు 20.53 లక్షల టన్నులకు పెరగడం దేశీయ రిఫైనర్లను ప్రభావితం చేస్తోంది.