Page Loader
Patanjali: పతంజలి ఫుడ్స్ వాటాదారులకు శుభవార్త.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ
పతంజలి ఫుడ్స్ వాటాదారులకు శుభవార్త.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ

Patanjali: పతంజలి ఫుడ్స్ వాటాదారులకు శుభవార్త.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

పతంజలి గ్రూప్‌కు చెందిన పతంజలి ఫుడ్స్ తమ బోనస్‌ షేర్లను ప్రకటించింది. 2:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయనుంది. అంటే, ఒక్క పతంజలి ఫుడ్స్ షేరు ఉన్న ప్రతి ఒక్కరికి అదనంగా రెండు ఉచిత షేర్లు లభిస్తాయి. ఇందుకు సంబంధించి జూలై 17 న నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీ ఫైలింగ్ ద్వారా సంస్థ వెల్లడించింది. పతంజలి ఫుడ్స్ తమ చరిత్రలో ఇదే మొదటి సారి బోనస్‌ షేర్లను ప్రకటించడం విశేషం. అయితే రికార్డు తేదీను సంస్థ ఇంకా ప్రకటించలేదు. బోనస్‌ షేర్ల జారీ ప్రక్రియలో భాగంగా రూ.2 ముఖ విలువ కలిగిన 72,50,12,628 ఈక్విటీ షేర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

వివరాలు 

స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న పతంజలి ఫుడ్స్ షేరు ధరలు 

రికార్డు తేదీ నాటికి ఎవరైనా వారి వద్ద ఫుల్లీ పెయిడ్‌-అప్‌ ఈక్విటీ షేర్లు ఉంచుకున్న వారికి ఈ బోనస్‌ షేర్లు అందుబాటులోకి రానున్నాయి. రెండు నెలల్లోపు, అంటే సెప్టెంబర్ 16లోపు, బోనస్‌ షేర్ల జారీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బోనస్‌ షేర్ల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు ధరలు రూ.1,861.40 వద్ద స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. గతంలో దివాలా ప్రక్రియలో భాగంగా రుచి సోయాను పతంజలి ఆయుర్వేద 2019లో స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని కోసం రూ.4,350 కోట్లు ఖర్చు చేసింది. అనంతరం రుచి సోయా పేరును పతంజలి ఫుడ్స్‌గా మార్చారు.

వివరాలు 

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1,301.34 కోట్ల నికర లాభం 

2022లో కంపెనీ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ (FPO) ద్వారా మరోసారి రూ.4,350 కోట్లు సమీకరించింది. ఆ మొత్తాన్ని రుచి సోయా రుణాలను చెల్లించేందుకు వినియోగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.1,301.34 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.765.15 కోట్లగా నమోదైంది.