
Patanjali Record: పతంజలి ఫుడ్స్‌కు అంతర్జాతీయ గౌరవం.. ప్రపంచ కస్టమ్స్ సంస్థ గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ భారతదేశంలో నమ్మకానికి ప్రతీకగా మరో ఘనతను సొంతం చేసుకుంది. స్వదేశీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ, ప్రపంచ కస్టమ్స్ సంస్థ (WCO), భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇండియన్ కస్టమ్స్ పతంజలికి ప్రతిష్టాత్మక AEO (ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్) టైర్-2 సర్టిఫికేట్‌ను ప్రదానం చేశాయి. సర్టిఫికేషన్ ప్రత్యేకత ఈ గుర్తింపు ప్రపంచ వాణిజ్యంలో సమగ్రత, పారదర్శకత, సరఫరా భద్రత వంటి అత్యున్నత ప్రమాణాలను సూచిస్తుంది. భారత్‌లో అగ్రశ్రేణి సంస్థలలో కొద్దికే ఈ గౌరవం లభించగా, FMCG రంగంలో మరీ అరుదుగా మాత్రమే ఈ సర్టిఫికేషన్ లభించింది. ఇప్పుడు ఆ జాబితాలో పతంజలి పేరు సువర్ణాక్షరాలతో నిలిచింది.
Details
లభించే ప్రయోజనాలు
ఈ AEO టైర్-2 సర్టిఫికేట్ ద్వారా పతంజలి ఫుడ్స్‌కి: డ్యూటీ వాయిదా చెల్లింపు బ్యాంక్ గ్యారెంటీ మినహాయింపు డైరెక్ట్ పోర్ట్ డెలివరీ (DPD) 24×7 క్లియరెన్స్ సౌకర్యం మొత్తం 28 రకాల అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. ఇది సంస్థ నాణ్యత, సమగ్రత, పారదర్శకతకు నిదర్శనం మాత్రమే కాకుండా, భారత ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేసే ఘనత కూడా.
Details
స్వామి రామ్‌దేవ్ స్పందన
"ఈ రోజు పతంజలి కుటుంబానికి మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజు అని స్వామి రామ్‌దేవ్ అన్నారు. విశ్వసనీయత, నాణ్యత, పోటీశీలతలో పతంజలి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, వ్యాపార రంగంలో ప్రతి రోజూ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ఈ సర్టిఫికేట్ దేశాన్ని నిర్మించాలనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని స్పష్టం చేశారు. "ఈ గౌరవం మా పట్టుదల, నాణ్యత, నిజాయితీకి ప్రతీక. 'స్వదేశీ సే స్వాభిమాన్' మార్గంలో మేము మరింత వేగంగా ముందుకు సాగి, మేక్ ఇన్ ఇండియాను ప్రపంచ శిఖరాగ్రానికి తీసుకెళ్తామని బాబా రామ్‌దేవ్ హామీ ఇచ్చారు.
Details
ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యలు
ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ ఈ విజయం మొత్తం పతంజలి కుటుంబం, ఉద్యోగులు, వినియోగదారుల సమిష్టి కృషి ఫలితమని అన్నారు. AEO టైర్-2 సర్టిఫికేషన్ మా పారదర్శకత, నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలకున్న కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇది ఎగుమతులను పెంచడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. సంస్కృతి, ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పతంజలిని ప్రపంచంలోని అగ్రశ్రేణి FMCG బ్రాండ్లలో ఒకటిగా నిలబెట్టి, భారత ఎగుమతులను కొత్త శిఖరాలకు తీసుకెళ్తామనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.