
Paytm credit line on UPI: పేటీఎంలో యూపీఐ క్రెడిట్ లైన్ ఫీచర్ .. ఎలా ఉపయోగించుకోవాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం (Paytm) యూపీఐ క్రెడిట్ లైన్ సదుపాయాన్ని ప్రారంభించింది. దీన్ని 'Paytm Postpaid' అనే పేరుతో లాంచ్ చేసింది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త సదుపాయం ద్వారా యూజర్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి, వచ్చే నెలలో ఒకేసారి బిల్లు చెల్లించే అవకాశం పొందుతారు.
వివరాలు
UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి?
UPI వేదికగా చిన్న ఖర్చులు, తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం డిజిటల్ రుణాలను క్రెడిట్ లైన్ రూపంలో అందజేస్తారు. యూజర్లు మర్చంట్లకు స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో నగదు నిల్వ లేకపోయినా కూడా, ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్ ద్వారా డెబిట్ అయ్యేలా ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ ప్రకారం తిరిగి చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాదారులు మరియు కొత్త వినియోగదారులకు ఈ క్రెడిట్ లైన్ సదుపాయం అందుబాటులో ఉందని పేటీఎం ప్రకటించింది.
వివరాలు
ఎలా వాడాలి? ప్రయోజనమేంటి?
పేటియం యాప్ ఓపెన్ చేయండి. మర్చంట్ QR కోడ్ స్కాన్ చేయండి. క్రెడిట్ లైన్ ఎంపిక చేసుకుని చెల్లింపులు చేయండి. UPI మాదిరిగానే పిన్ ఎంటర్ చేసి లావాదేవీలను పూర్తి చేయవచ్చు. QR కోడ్, ఆన్‌లైన్ కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లు చెల్లింపులకు ఈ క్రెడిట్ లైన్ ఉపయోగించవచ్చు.
వివరాలు
ఎలా వాడాలి? ప్రయోజనమేంటి?
వ్యక్తుల నుంచి వ్యక్తులకు చెల్లింపులు (P2P) చేయలేరు. బ్యాంక్‌లో నగదు లేకపోయినప్పుడు UPI క్రెడిట్ లైన్ ఎంతో ఉపయోగపడుతుంది. నెలకు గరిష్టంగా రూ.60,000 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. 30 రోజుల వరకు వడ్డీ లేకుండా కాలాన్ని వినియోగించి తిరిగి చెల్లించుకోవచ్చు. ప్రతి నెలా ఒకటో తేదీన బిల్లింగ్ అవుతుందని పేటీఎం పేర్కొంది. Paytm Postpaid యాక్టివేట్ చేయగానే వెంటనే చెల్లింపులు చేయడానికి అవకాశం లభిస్తుంది. వినియోగించిన మొత్తానికి తక్కువ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని కూడా పేటీఎం వివరించింది.