
PhonePe: ఫోన్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయండిలా
ఈ వార్తాకథనం ఏంటి
నేటి అధునిక సమాజంలో యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు.
పట్టణాలు నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు విస్తరించాయి. తాజాగా ఫోన్ పే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
యూజర్ల కోసం తాజాగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా మన బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా పేమెంట్స్ చేసేందుకు వెలుసుబాటు కల్పించింది.
క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
Details
మర్చంట్లకు చెల్లింపులు చేసే అవకాశం
కస్టమర్లు బ్యాంకు నుంచి క్రెడిట్ లైన్ సౌకర్యం పొంది ఉంటే, ఇప్పుడు ఆ క్రెడిట్ లైన్‌ను ఫోన్ పేతో లింక్ చేసుకోవచ్చు.
తద్వారా ఫోన్ పే నుంచి క్రెడిట్ లైన్‌లో మార్చంట్లకు చెల్లింపులు చేయొచ్చు.
ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ పే యూజర్లు ఇకపై లక్షలమంది మర్చంట్లకు సులభంగానే పేమెంట్ చేయొచ్చు.
ఆర్‌బీఐ ఇటీవలనే యూపీఐ సేవలను విస్తరించిన తరుణంలో ఫోన్‌పే ఈ సేవలు ఆవిష్కరించింది.
Details
క్రెడిట్ వినియోగం పెరిగే అవకాశం
ఈ సదుపాయం వల్ల క్రెడిట్ వినియోగం పెరుగుతుందని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు.
మొదటగా ఫోన్‌పే వాడే వారు ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి, అక్కడ బ్యాంక్ ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాత క్రెడిట్ లైన్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ పేరు ఎంపిక చేసి, తర్వాత లింక్ చేసుకోవాలి.
లింక్ చేసుకున్న తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకున్న తర్వాత క్రెడిట్ లైన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక పేమెంట్ పేజ్‌లో మీరు దీన్ని గమనించవచ్చు.